News July 2, 2024

కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించండి: AIRTELకు NCDRC ఆదేశం

image

డూప్లికేట్ సిమ్‌ను జారీ చేసినందుకు కస్టమర్‌కు పరిహారం చెల్లించాలని AIRTELను NCDRC ఆదేశించింది. ఓ ఆర్మీ ఉద్యోగి మొబైల్ నంబర్‌పై గుర్తు తెలియని వ్యక్తి మోసపూరితంగా సిమ్ కార్డు పొంది అతని బ్యాంకు అకౌంట్ నుంచి 2017లో ₹2,87,630 డ్రా చేశాడు. దీనిపై కంప్లైంట్ ఇవ్వగా నిందితుడిని గుర్తించడంలో కంపెనీ విఫలమైందని కమిషన్ తేల్చింది. ఫిర్యాదుదారు శ్యామ్ కుమార్‌కు ₹2.8 లక్షలతో పాటు ₹లక్ష పరిహారం చెల్లించాలంది.

Similar News

News November 24, 2025

ఎచ్చెర్ల: పాలకమండలి సమావేశం ఎప్పుడో..?

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో 2022 NOVలో పాలకమండలి చివరి సమావేశం జరిగింది. మూడేళ్లైనా..ఇప్పటికీ సమావేశం ఊసేలేదు. కనీసం ఆరు నెలలకోసారైన సమీక్ష జరగాలని విద్యావేత్తలు అంటున్నారు. పాలన, అకాడమిక్, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ మండలిలో ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో 12 మంది ఉన్నారు. నిబంధనలు మేరకు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

News November 24, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 24, 2025

స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం!

image

మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో నిన్న జరగాల్సిన పెళ్లి <<18368671>>వాయిదా<<>> పడింది. ఆ తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురైనట్లు NDTV తెలిపింది. వైరల్ ఫీవర్‌తో పాటు ఎసిడిటీ పెరగడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. మరోవైపు స్మృతి తండ్రిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు.