News March 17, 2024
పాయకరావు పేట: బోటు బోల్తా పడి వ్యక్తి మృతి

పాయకరావుపేట మండలం వెంకటనగరం తీరంలో ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు, బోటు బోల్తా పడడంతో మృతి చెందాడు. రాజానగరం గ్రామానికి చెందిన గరికిన కొత్తబాబు తన కుమారుడు, మరో వ్యక్తితో కలిసి వెంకటనగరం రేవులో చేపల వేటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం పడవ బోల్తా పడడంతో కొత్తబాబు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారాన్ని ఫిషరీస్ అధికారులకు తెలియజేశామన్నారు.
Similar News
News April 4, 2025
వీఎంఆర్డీఏలో 113 మందికి ప్లాట్ల కేటాయింపు

V.M.R.D.A. అధికారులు ఎంఐజి లే అవుట్లోని ప్లాట్లకు గురువారం డ్రా నిర్వహించారు. అడ్డూరు, గరివిడి, పాలవలసల్లో 113 మందికి ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయించారు. అడ్డూరులో 146, గరివిడిలో 212, పాలవలసలో 472 ప్లాట్లను V.M.R.D.A. అభివృద్ధి చేసింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నారు.
News April 3, 2025
పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైలు: విశాఖ సీపీ

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు. పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైళ్ళు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.
News April 3, 2025
రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్‌గా ECoR అవతరించిందని పేర్కొన్నారు.