News August 16, 2024
కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారా? మీకో గుడ్ న్యూస్
ఫోన్ పే/గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించినట్లు TGSPDCL, APCPDCL వెల్లడించాయి. ప్రస్తుతం ఫోన్ పేతో పాటు విద్యుత్ సంస్థల యాప్‌లు, వెబ్‌సైట్లలో బిల్లులు చెల్లించవచ్చని తెలిపాయి. మరో 4, 5 రోజుల్లో గూగుల్ పే ద్వారా కూడా స్వీకరిస్తామని పేర్కొన్నాయి. రెండు నెలల క్రితం ఫోన్ పే వంటి డిజిటల్ యాప్స్ నుంచి చెల్లింపులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Similar News
News September 13, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
AP: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇటు టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది.
News September 13, 2024
‘దేవర’కు అరుదైన ఘనత
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమాకు అరుదైన ఘనత లభించింది. లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్‌లో ఈ మూవీ ప్రదర్శించనున్నారు. ఈనెల 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్‌లో షో వేయనున్నారు. ఈ విషయాన్ని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు తెలిపాయి. హాలీవుడ్ సెలబ్రిటీలూ ‘దేవర’ చూడనున్నట్లు సమాచారం.
News September 13, 2024
ఊరట ఓకే.. సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌కు వెళ్లలేని కేజ్రీవాల్
<<14090235>>బెయిల్‌పై<<>> బయటకొస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు పెట్టిన కండీషన్లే ఇక్కడా వర్తిస్తాయని చెప్పడమే ఇందుకు కారణం. దీంతో ఆయన సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌కు వెళ్లలేరు. ఈ కండీషన్లపై అభ్యంతరం ఉన్నా జుడీషియల్ డిసిప్లిన్, ట్రయల్ కోర్టు తీర్పును గౌరవిస్తూ వాటిపై వ్యతిరేక ఆదేశాలు ఇవ్వడం లేదని జస్టిస్ భూయాన్ అన్నారు.