News December 15, 2024
UPI ద్వారా రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు: కేంద్రం

ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య యూపీఐ ద్వారా 15,547 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మొత్తం రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. దేశంలో ఆర్థిక లావాదేవీలపై యూపీఐ ప్రభావాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం భారత్తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News December 3, 2025
డిజిటల్ సేవల విస్తరణపై కేంద్రం దృష్టి సారించాలి: ఎంపీ కావ్య

వరంగల్ పార్లమెంటు పరిధిలో డిజిటల్ సేవల విస్తరణపై కేంద్రం దృష్టి సారించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. డిజిటల్ సేవల విస్తరణపై పార్లమెంటులో ఎంపీ ప్రశ్నించారు. 5G సేవలు, పోస్టల్ సేవల డిజిటలీకరణ, డిజిటల్ సాక్షరత, సైబర్ భద్రతపై ఎంపీ వివరణ కోరారు. జిల్లాలో 5G సేవల విస్తరణ కోసం ఇప్పటి వరకు 209 బీటీఎస్ టవర్లు ఏర్పాటు చేసినట్లు కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
News December 3, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమ్ ఇండియా ప్లేయర్ మోహిత్ శర్మ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2015లో చివరిసారి అతడు భారత జట్టు తరఫున ఆడారు. మీడియం పేసర్ అయిన ఈ 37 ఏళ్ల బౌలర్ 26 వన్డేల్లో 31 వికెట్లు, 8 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టారు. IPLలో మోహిత్ CSK, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.