News June 21, 2024
కేంద్రాన్ని ఆశ్రయించిన పేటీఎం ఉద్యోగులు

పేటీఎంలో వేటుకు గురైన పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమను తొలగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. తమ ఉద్యోగాలను సంస్థ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50 మంది ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.
Similar News
News November 8, 2025
₹5,942 కోట్లతో సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టు: లోకేశ్

TGకి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ₹5,942 కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. దీనికోసం 2005లో నాయుడుపేట ఇండస్ట్రీయల్ పార్కులో 269 ఎకరాలు కేటాయించామన్నారు. 5GW సిలికాన్ ఇంగోట్, 4GW టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్లు నెలకొల్పుతారని చెప్పారు. వీటిని 7GWకి విస్తరిస్తారన్నారు. దీనిద్వారా 3500మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
News November 8, 2025
DEC 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 8, 2025
AFCAT నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్(MPC), BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు NOV 10 నుంచి DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్కు 20-24ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్కు 20-26ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,00-రూ.1,77,500 చెల్లిస్తారు. కోర్సు 2027 JANలో ప్రారంభమవుతుంది.


