News June 21, 2024
కేంద్రాన్ని ఆశ్రయించిన పేటీఎం ఉద్యోగులు
పేటీఎంలో వేటుకు గురైన పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమను తొలగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. తమ ఉద్యోగాలను సంస్థ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50 మంది ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.
Similar News
News September 20, 2024
బాంబే హైకోర్టులో కేంద్రానికి చుక్కెదురు.. ఐటీ రూల్స్ సవరణలు కొట్టివేత
IT రూల్స్‌కి కేంద్రం చేసిన సవరణలను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వచ్చే నకిలీ, తప్పుడు వార్తలకు అడ్డుకట్టవేయడానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొనేలా కేంద్రం IT చట్టానికి సవరణలు చేసింది. అయితే ఇది ఆర్టికల్ 14 (సమానత్వం), 19(స్వేచ్ఛ) హక్కులను ఉల్లంఘించడమేనని జస్టిస్ అతుల్ చందూర్కర్ బెంచ్ అభిప్రాయపడింది.
News September 20, 2024
వైవీ, ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ఫిర్యాదు
AP: TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ EO ధర్మారెడ్డిపై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘వైవీ, ధర్మారెడ్డి కలిసి తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేయించి అపవిత్రం చేశారు. తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ CM జగన్‌కు తెలియకుండా ఇది జరగదు. అందుకే ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.
News September 20, 2024
రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కలవనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు.