News December 9, 2024

జోరుమీదున్న Paytm షేర్లు.. ఎందుకంటే

image

Paytm మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు జోరుమీదున్నాయి. రూ.1007 వద్ద 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 15 నెలల రెసిస్టెన్సీని బ్రేక్ చేశాయి. జపాన్ కంపెనీ PayPayలో రూ.2364 కోట్ల విలువైన వాటాను సాఫ్ట్‌బ్యాంకుకు విక్రయించేందుకు అనుమతి లభించిందని పేటీఎం చెప్పడమే ఇందుకు కారణం. చైనా నుంచి పెట్టుబడులు రావడం, పేమెంట్ బ్యాంకు కష్టాలు తొలగిపోవడంతో కంపెనీ షేర్లు 6 నెలల్లోనే 183% రాబడి అందించాయి.

Similar News

News January 18, 2025

జనవరి 18: చరిత్రలో ఈరోజు

image

1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం
1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం
1975: సినీ నటి మోనికా బేడి జననం
1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం
2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం

News January 18, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి

News January 18, 2025

రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు మృతి

image

ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు అమన్ జైస్వాల్(23) మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను ట్రక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అమన్ ‘ధర్‌తీపుత్ర్ నందిని’ అనే సీరియల్‌లో లీడ్ రోల్‌లో నటించారు.