News November 14, 2024

అదే జరిగితే $65 మిలియన్లు కోల్పోనున్న PCB

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు భారత్ వెళ్లకపోతే ఆ దేశం భారీగా నష్టపోనుంది. మొండి వైఖరితో టోర్నీ నిర్వహణ నుంచి దాయాది వైదొలిగితే భారీగా నిధులను ఐసీసీ తగ్గించవచ్చని క్రిక్‌బజ్ వెల్లడించింది. ఒక వేళ టోర్నీని తరలించినా, వాయిదా వేసినా హోస్ట్ ఫీజుగా $65 మిలియన్లను కోల్పోతుందని తెలిపింది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే కరాచీ, రావల్పిండి, లాహోర్ స్టేడియాలను PCB అప్‌గ్రేడ్ చేసింది. దీంతో నష్టం మరింత పెరగనుంది.

Similar News

News November 14, 2024

‘దేవర’@50 డేస్.. ఎన్ని సెంటర్లలో అంటే?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ 50 డేస్ పూర్తి చేసుకుంది. 52 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైనట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

News November 14, 2024

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం GOOD NEWS

image

AP: అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్‌దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News November 14, 2024

చంద్రబాబూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?: రజిని

image

AP: సూపర్ సిక్స్ హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ మంత్రి రజిని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించావ్? ఉచిత బస్సుకు అతీగతీలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? రూ.4వేల పింఛన్ ఎంత మందికిచ్చావ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటున్నావ్? నాతో సహా మా పార్టీ కార్యకర్తలు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు’ అని తెలిపారు.