News September 20, 2024
ప్చ్.. భారతీయ ఉద్యోగి! టూ మచ్ వర్కింగ్ అవర్స్..
ఉద్యోగులు కుటుంబ జీవితానికి ఎంత దూరమవుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. సగటు భారతీయుడు వారానికి 46.7Hrs పనిచేస్తున్నాడని ILO డేటా ద్వారా తెలిసింది. దీంతో సుదీర్ఘ సమయం పనిచేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని వర్క్‌ఫోర్స్‌లో 51% మంది వారానికి 49Hrs మించి పనిచేస్తుండటం గమనార్హం. 61 శాతంతో భూటాన్ No.1 ప్లేస్‌లో ఉంది. UAE 50.9, లెసొతో 50.4, బంగ్లా 47, పాక్ 40 టాప్10లో ఉన్నాయి.
Similar News
News October 9, 2024
గ్రూప్-1 మెయిన్స్‌పై కీలక అప్‌డేట్
TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
News October 9, 2024
JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!
టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.
News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి
TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.