News March 4, 2025

ప్చ్.. కోహ్లీ సెంచరీ మిస్

image

ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీఫైనల్లో కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ కాస్త దూరంలో ఆగిపోయారు. 84 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43 ఓవర్లలో 226/5గా ఉంది. భారత్ విజయానికి 42 బంతుల్లో 39 రన్స్ అవసరం. క్రీజులో కేఎల్ రాహుల్ (31*), హార్దిక్ పాండ్య (1*) క్రీజులో ఉన్నారు.

Similar News

News March 25, 2025

రూ.లక్షలు ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు: పూజా హెగ్డే

image

కొంతమంది రూ.లక్షలు ఖర్చుపెట్టి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారని హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ‘నాపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను కాంటాక్ట్ చేయమని మా టీమ్‌కు చెప్పాను. ఈ పని చేసేందుకు తమకు రూ. లక్షలు ఇస్తున్నారని మా టీమ్‌తో మీమర్స్ చెప్పారు. ట్రోలింగ్ ఆపాలంటే నేను కూడా అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు’ అని పేర్కొన్నారు. తెలుగులో ఆమె చివరిగా ఎఫ్-3లో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.

News March 25, 2025

కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్

image

ఉగాది సందర్భంగా రిలీజయ్యే కొత్త సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నార్నె నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’, నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలపై రూ.75 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పెరిగిన ధరలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయంది. TGలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

News March 25, 2025

షాకింగ్: వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం

image

AP: కడప(D) వల్లూరు సెంటర్‌లో నిన్న గణిత పరీక్ష సమయంలో పేపర్ లీక్ అయిందని DEO షంషుద్దీన్ తెలిపారు. వాటర్ బాయ్‌‌గా పనిచేసే సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి వాట్సాప్ చేసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం TGలోని నకిరేకల్‌లోనూ టెన్త్ పేపర్ లీకైంది.

error: Content is protected !!