News October 8, 2024
జమ్మూకశ్మీర్‌లో పట్టు కోల్పోతున్న PDP

JKలో PDP పట్టుకోల్పోతోంది. 2014 ఎన్నికల్లో ముఫ్తీ మొహమ్మద్ సారథ్యంలో 28 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 4 స్థానాలకు పరిమితమైంది. 2014లో ముక్కోణపు పోటీలో హంగ్ ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు BJPతో PDP చేతులుకలపడం ప్రజలకు రుచించినట్టు లేదు. JK ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారు. పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె కుమార్తె ఇల్తిజా ఓటమిపాలయ్యారు.
Similar News
News December 14, 2025
హైదరాబాద్‌లో మెస్సీ.. PHOTO GALLERY

మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. తొలిసారి నగరానికి వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. తనదైన మార్క్ కిక్స్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్లేయర్ అవతారమెత్తారు. మెస్సీతో గేమ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఫొటో గ్యాలరీని పైన చూడవచ్చు.
News December 14, 2025
జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇవాళ ప్రెస్‌మీట్‌లో మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీ రోల్‌లో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘రాజాసాబ్(JAN 9)’, శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి(JAN 14)’ కూడా ఉన్నాయి.
News December 14, 2025
అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్‌గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.


