News November 19, 2025

PDPL: డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే చెప్పండి: కలెక్టర్

image

PDPL జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాల నిరోధంపై ఆయన నిన్న ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ యువత జీవితాలను నాశనం చేస్తాయని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 14, 2026

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

image

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల వివరాల ప్రకారం.. భిక్కనూర్‌లో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత నమోదైంది. బోమనదేవిపల్లి, సోమూర్, జుక్కల్ ప్రాంతాల్లో కూడా 42.8°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40°C నుంచి 43°C మధ్య నమోదవ్వడంతో ‘అలర్ట్’ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

News April 14, 2026

GNR: ఈ నెల 16 నుంచి స్వీయ నమోదు ప్రారంభం

image

గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత జనగణన డిజిటల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ వారంలో భాగంగా 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం కల్పించారు. మొత్తం 33 ప్రశ్నలతో కుటుంబ వివరాలు నమోదు చేయాలి. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సమాచారం ఇవ్వవచ్చు. మే 1 నుంచి గణకులు ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఆధార్ వంటి పత్రాలు అవసరం లేదు. వివరాల గోప్యతకు చట్ట పరిరక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.

News April 14, 2026

వేటకు విరామం.. త్వరలో అకౌంట్లోకి రూ.20,000

image

AP: నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగనుంది. చేపల పునరుత్పత్తికి వీలుగా ఏటా ఈ విరామాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. 61 రోజులపాటు వేటకు దూరంగా ఉండే మత్స్యకారులు ఇబ్బంది పడకుండా త్వరలో రూ.20వేల చొప్పున అకౌంట్లలో జమ చేయనుంది. ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది దాదాపు 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది.