News December 9, 2024
శాంతిభద్రతలే ఆప్ ఎన్నికల అజెండా!

ఢిల్లీలో లా అండ్ ఆర్డర్‌ను ఆప్ ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన వరుస హత్యలు, వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ అంశాల చుట్టూ ఆప్ నెరేటివ్ బిల్డ్ చేస్తోంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ డైరెక్షన్‌లో పనిచేస్తారు కాబట్టి అమిత్ షాను టార్గెట్ చేస్తోంది. చైన్, ఫోన్ స్నాచింగ్, ఎక్స్‌టార్షన్స్, మహిళ్లలో అభద్రతా భావానికి కేంద్రం వైఫల్యాలే కారణమంటూ విమర్శిస్తోంది.
Similar News
News January 30, 2026
NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News January 30, 2026
టమాటా రైతుల ఆవేదన.. కిలో రూపాయి కూడా లేదు!

AP: టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. 3నెలల క్రితం కిలో రూ.60 పలికిన టమాటాకి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన నాణ్యమైన రకం ఇప్పుడు రూ.7 కూడా పడట్లేదని వాపోతున్నారు. మూడో రకమైతే రూపాయి కూడా రావట్లేదని చెబుతున్నారు. కోత కూలీ, ప్రయాణ ఖర్చులు కూడా రావట్లేదని కొందరు రైతులు పంటను వదిలేస్తున్నారు.
News January 30, 2026
కెనడా విమానాలపై ట్రంప్ టారిఫ్ బాంబ్

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% టారిఫ్‌లు వేస్తానని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికన్ గల్ఫ్‌స్ట్రీమ్ జెట్లకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడమే కారణమని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా బొంబార్డియర్ సహా కెనడియన్ విమానాల సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇటీవల <<18949938>>కెనడాపై<<>> 100% సుంకాలు వేస్తానని ట్రంప్ బెదిరించారు.


