News December 9, 2024

శాంతిభ‌ద్ర‌త‌లే ఆప్‌ ఎన్నిక‌ల అజెండా!

image

ఢిల్లీలో లా అండ్ ఆర్డ‌ర్‌ను ఆప్ ఎన్నిక‌ల అజెండాగా మార్చుకుంటున్నట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రుస హ‌త్య‌లు, వేల కోట్ల డ్ర‌గ్స్ రాకెట్ అంశాల చుట్టూ ఆప్ నెరేటివ్ బిల్డ్ చేస్తోంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ డైరెక్షన్‌లో ప‌నిచేస్తారు కాబ‌ట్టి అమిత్ షాను టార్గెట్‌ చేస్తోంది. చైన్‌, ఫోన్ స్నాచింగ్‌, ఎక్స్‌టార్ష‌న్స్, మ‌హిళ్ల‌లో అభ‌ద్ర‌తా భావానికి కేంద్రం వైఫల్యాలే కారణమంటూ విమర్శిస్తోంది.

Similar News

News January 19, 2025

గజగజ.. 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కనిష్ఠంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జనవరి 24/25 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 19, 2025

kg చికెన్ ధర ఎంతో తెలుసా?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.220-230గా ఉంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ.240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ.117గా కొనసాగుతోంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ.70గా ఉంది.

News January 19, 2025

WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్‌ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.