News July 10, 2024
త్వరలో పెండింగ్ మెస్ ఛార్జీలు విడుదల: స్వామి

AP: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. మెస్ ఛార్జీలు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఏ విద్యార్థికి లోటు లేకుండా చూస్తామని మంత్రి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు పూర్వవైభవం తెస్తామని వెల్లడించారు.
Similar News
News July 9, 2025
తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఇవే!

ఓరోజు తగ్గుతూ తర్వాతి రోజు పెరుగుతూ బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹660 తగ్గి ₹98,180కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹600 తగ్గి ₹90,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 పెరిగి రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 9, 2025
మేడిగడ్డ కూలిపోవాలనే గాలికొదిలేశారా?: బీఆర్ఎస్

TG: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని BRS ఆరోపించింది. ‘మేడిగడ్డపై సెక్యూరిటీని తొలగించడంతో బ్యారేజీపైన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయి. భారీ వాహనాల వల్ల పిల్లర్లపై ఒత్తిడి పడి కొట్టుకుపోవాలనేదే కాంగ్రెస్ కుట్ర. దీనిని పనికిరాని ప్రాజెక్టుగా చూపించి KCRను దోషిగా నిలబెట్టాలని చూస్తోంది. ఏపీ ప్రయోజనాలకు గోదావరి నీటిని బహుమతిగా ఇవ్వాలనే రెండో ప్లాన్ ఉంది’ అని రాసుకొచ్చింది.
News July 9, 2025
తిరుమలలో మొదట ఎవరిని దర్శించుకోవాలంటే?

తిరుమల కొండపైకి చేరుకోగానే చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. నిజానికి తిరుమల ఆదివరాహ క్షేత్రం. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు తొలుత పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఈ విషయాన్ని ‘TTD అప్డేట్స్’ X వేదికగా పేర్కొంటూ భక్తులకు అవగాహన కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం.. వరాహ స్వామికి మొదటి పూజ, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి.