News June 13, 2024
అంబుజా చేతికి పెన్నా సిమెంట్
పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్స్‌కు చెందిన అంబుజా సిమెంట్ ప్రకటించింది. పెన్నా అధినేత పి.ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన కుటుంబం పేరిట ఉన్న 100% షేర్లను బదిలీ చేసుకుంటామని తెలిపింది. పెన్నాకు 14 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. కృష్ణపట్నం, జోధ్‌పుర్‌లో మరో 2 యూనిట్లు సిద్ధమవుతున్నాయి.
Similar News
News September 20, 2024
జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.
News September 20, 2024
‘బంగ్లా’ను కుప్పకూల్చారు
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 149 రన్స్‌కే కుప్పకూల్చారు. బుమ్రా 4, ఆకాశ్ దీప్ 2, జడేజా 2, సిరాజ్ 2 చొప్పున వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 227 రన్స్ ఆధిక్యంలో ఉంది.
News September 20, 2024
నెయ్యిలో నాణ్యత లేదు: టీటీడీ ఈఓ
AP: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.