News August 21, 2025

SEP 1న పెన్షన్‌ విద్రోహ దినం: తెలంగాణ ఉద్యోగ JAC

image

TG: తెలంగాణ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మరోసారి జంగ్ సైరన్ మోగించింది. ‘ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఇప్పటివరకు సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హామీలు అమలు కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. 200కు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో కలిసి పోరాడుతున్నాం. SEP 1న పెన్షన్ విద్రోహ దినం నిర్వహిస్తాం. అక్టోబర్‌ 12న చలో హైదరాబాద్‌ చేపడతాం’ అని TGEJAC పేర్కొంది.

Similar News

News March 4, 2026

ఇరాన్ అణుబాంబు ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు

image

యుద్ధం వేళ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం అణుబాంబు సిద్ధంగా లేదని, తయారు చేస్తోందనడానికి ఆధారాలూ లేవన్నారు. కానీ ఆ దేశం దగ్గర యురేనియం నిల్వలు ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. ఇరాన్ అణుబాంబు ప్రయోగిస్తుందనే ప్రచారంపై స్పష్టత లేదన్నారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందని ఆరోపిస్తూ US, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి.

News March 4, 2026

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి పీజీ, పీజీ(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd, MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.amuonline.ac.in/

News March 4, 2026

నెయ్యి సరఫరాలో చంద్రబాబు స్కామ్‌లు: జగన్

image

AP: CM చంద్రబాబు తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని జగన్ Xలో విమర్శించారు. ‘TTD ఛైర్మన్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే CBN చర్యలు తీసుకోలేదు. అతడినే పదవిలో కొనసాగించి ఆలయ ప్రతిష్ఠను కాలరాశారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరికి మీదికి నెట్టారు. నెయ్యి సరఫరాను ఇందాపూర్‌ డెయిరీకి కట్టబెట్టి స్కామ్‌లు చేస్తూ సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు’ అని ఆరోపిస్తూ <>డీటెయిల్స్<<>> షేర్ చేశారు.