News April 21, 2024

గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొడుతున్నారు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ గులకరాయి డ్రామాను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని TDP చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘బీ ఫామ్ అందుకున్న ప్రతీ అభ్యర్థి గెలిచి రావాలి. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కొత్త అభ్యర్థులు పార్టీ నిబంధనలు పాటించాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్నదే నా ఆశయం. ప్రజాగళానికి వస్తున్న ఆదరణ చూసి జగన్ వణికిపోతున్నారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేకే జగన్ డ్రామాలాడుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News October 15, 2024

హైదరాబాద్‌లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

image

TG: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. చెన్నై నుంచి లింగంపల్లి వచ్చిన ఆమె నానక్‌రామ్‌గూడ వెళ్లేందుకు ఈ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటో ఎక్కింది. డ్రైవర్ మసీద్ బండ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, అక్కడే వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News October 15, 2024

మార్కెటింగ్ కంటెంట్లో AIతో జాగ్రత్త.. లేదంటే!

image

AI‌తో లాభాలున్నా సరైన పర్యవేక్షణ లేకుంటే జరిగే నష్టం అపారం. వెస్ట్రన్ కల్చర్, లాంగ్వేజెస్ వరకు పర్లేదు గానీ భారతీయ భాషలు, కల్చర్‌పై అవగాహన లేకుంటే దెబ్బ తప్పదు. ‘ఐపిల్ గర్భనిరోధక మాత్ర నిన్ను మిస్సవుతోంది పల్లవీ’ అంటూ జెప్టో పంపిన నోటిఫికేషన్ దీనినే తెలియజేస్తోంది. ఇలాంటి కంటెంట్ ఇస్తున్నప్పుడు మానవ పర్యవేక్షణ కంపల్సరీ అంటున్నారు నిపుణులు. గుడ్డిగా AIని నమ్మొద్దంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?

News October 15, 2024

విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి: ప్రభుత్వం

image

AP: వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఫుడ్‌ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’ అని ఆదేశించింది.