News November 19, 2024
ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి శ్రీధర్
TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రచారానికి తక్కువ ఖర్చు, సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టేందుకే తాము ప్రయత్నిస్తామని తెలిపారు. వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. BRS ఒక్క రూపాయి అభివృద్ధి చేస్తే వంద రూపాయల ప్రచారం చేసుకుందని, తాము వంద రూపాయల అభివృద్ధి చేసినా ఒక్క రూపాయి ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2024
ఆ రోజు సెలవు ఇవ్వాలని వినతి
TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కమిటీ కోరింది. ఈమేరకు ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అటు రాష్ట్ర కాంగ్రెస్ గిరిజన నేతలు కూడా కేంద్రాన్ని ఇదే విషయమై డిమాండ్ చేశారు. కాగా గతేడాది ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలీడే ఇచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2024
కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు: CM
TG: ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి యువ వికాసం సభలో అన్నారు. ‘తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మొదట ఈ గడ్డపై నుంచే చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ పాలనలో గిట్టుబాటు ధర రాక రైతులు ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయనకు మాత్రం ఎకరాకు రూ.కోటి ఆదాయం వచ్చింది’ అని విమర్శించారు.
News December 4, 2024
మూవీ ముచ్చట్లు
* 2025 జనవరి 4న ‘రఘువరన్ బీటెక్’ రీరిలీజ్
* పుష్ప-2 మరో రికార్డ్.. బుక్ మై షోలో ఫాస్టెస్ట్ 2 మిలియన్ టికెట్స్ సేల్
* ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఓటీటీలోకి అమరన్(నెట్‌ఫ్లిక్స్), మట్కా(అమెజాన్)
* 12వేలకు పైగా థియేటర్లలో పుష్ప-2 విడుదల
* డ్రగ్స్ కేసులో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ అరెస్ట్