News August 31, 2024

‘గృహజ్యోతి’ పేరుతో ప్రజలను మోసం చేశారు: BRS

image

TG: రేవంత్ సర్కార్ గృహజ్యోతి పథకం పేరుతో పేదలను నమ్మించి నట్టేట ముంచిందని BRS పార్టీ X వేదికగా విమర్శించింది. కాంగ్రెస్‌ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి షరతులు లేకుండా కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని చెప్పిందని, ఇప్పుడేమో ముక్కు పిండి వసూలు చేస్తోందని ఆరోపించింది. మీకు ఉచిత విద్యుత్ అందుతోందా? కామెంట్ ద్వారా తెలియజేయండి.

Similar News

News March 5, 2025

దక్షిణ భారత టూరిజానికి ఏపీ ముఖద్వారం: కందుల దుర్గేశ్

image

AP: జర్మనీ పర్యటనలో ఉన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ రెండో రోజు బెర్లిన్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ప్రపంచ మీడియా ప్రతినిధులకు వివరించారు. ‘అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. దక్షిణ భారత పర్యాటకానికి ఏపీ ముఖద్వారం. సుదీర్ఘ సముద్రతీరం, అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఏపీ సొంతం’ అని పేర్కొన్నారు.

News March 5, 2025

డీల్ కుదిరినట్టేనా? జెలెన్‌స్కీ నుంచి ట్రంప్‌కు లేఖ

image

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పంపిన లేఖ అందిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే మినరల్ డీల్‌పై నెగోషియేషన్‌కు ఆయన ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. ‘రష్యా, ఉక్రెయిన్ వివాదం ఆపేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా. ప్రతివారం రెండు దేశాలకు చెందిన వందలమంది మరణిస్తున్నారు. మరో ఐదేళ్లు యుద్ధాన్ని ఇలాగే కొనసాగనిద్దామా’ అని ప్రశ్నించారు.

News March 5, 2025

నన్ను సస్పెండ్ చేసినా.. బీసీ ఉద్యమం ఆగదు: తీన్మార్ మల్లన్న

image

TG: తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన BC ఉద్యమం ఆగదని MLC తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. HYD ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, ఆ చిత్తు కాగితం తగలబెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. KCR సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని, నూటికి నూరు శాతం చేస్తేనే సర్వే ఆదర్శం అవుతుందని తెలిపారు.

error: Content is protected !!