News August 31, 2024
‘గృహజ్యోతి’ పేరుతో ప్రజలను మోసం చేశారు: BRS

TG: రేవంత్ సర్కార్ గృహజ్యోతి పథకం పేరుతో పేదలను నమ్మించి నట్టేట ముంచిందని BRS పార్టీ X వేదికగా విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి షరతులు లేకుండా కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని చెప్పిందని, ఇప్పుడేమో ముక్కు పిండి వసూలు చేస్తోందని ఆరోపించింది. మీకు ఉచిత విద్యుత్ అందుతోందా? కామెంట్ ద్వారా తెలియజేయండి.
Similar News
News February 18, 2025
3 నెలలుగా ‘గృహలక్ష్మి’ స్కీమ్ డబ్బుల్లేవ్!

కర్ణాటక గ్యారంటీ స్కీములను నిధుల కొరత వేధిస్తోంది. 3 నెలలుగా లబ్ధిదారుల అకౌంట్లలో గృహలక్ష్మి డబ్బులు వేయడం లేదు. అన్నభాగ్య సహా మరికొన్ని స్కీములకూ బదిలీ చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, త్వరలోనే వేస్తామని Dy CM DK శివకుమార్ తెలిపారు. 3 నెలలుగా డబ్బులు వేయడం లేదన్న సంగతి తనకు తెలియదని CM సిద్దరామయ్య అన్నారు. ఏదేమైనా స్కీములను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్.
News February 18, 2025
భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్‌లో విండీస్‌పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్‌పై ఈ స్కోర్లు చేశారు.
News February 18, 2025
BREAKING: టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు డబ్బులు చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ <