News June 13, 2024
ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు: CM చంద్రబాబు

ఏపీ చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేట్ విజయం ఎప్పుడూ రాలేదని CM చంద్రబాబు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయం సాధించాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. 2003లో అలిపిరి వద్ద జరిగిన క్లేమోర్ మైన్స్ దాడి నుంచి తనను వెంకటేశ్వరుడే రక్షించారని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
లక్ష్యంపై గురి తప్పకూడదంటే ఇవి తప్పనిసరి

ఎన్ని అడ్డంకులున్నా అర్జునుడికి తాను గురిపెట్టిన పక్షి కన్నే కనిపించేదట. సాధకుడికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా గమ్యంపై గురి తప్పకూడదు. అలా ఉండేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులు కొన్ని మార్గాల్ని సూచిస్తున్నారు. అవి.. పని ఎప్పుడు ఎలా చేయాలన్న ప్రణాళిక ముందుగానే రచించుకోవాలి. పనుల్ని వాయిదా వేయకూడదు. ఒకేసారి అన్నీ చేసేద్దామనుకోకూడదు. ఒత్తిడికి లోనుకాకుండా అప్పుడప్పుడూ స్వల్ప విరామం తీసుకోవాలి.
News March 24, 2025
ప్యాసింజర్ల హక్కులపై ఎయిర్‌లైన్స్‌కు DGCA కఠిన ఆదేశాలు

ప్యాసింజర్ల హక్కులను తెలియజేస్తూ ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎయిర్‌లైన్స్‌కు DGCA సూచించింది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో అందుబాటులో ఉన్న ప్యాసింజర్ ఛార్టర్‌ను టికెట్ బుక్ చేసుకున్న వారికి వాట్సాప్/SMS ద్వారా పంపించాలని ఆదేశించింది. అలాగే ఈ సమాచారాన్ని టికెట్ల పైన, వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని తెలిపింది. దీంతో లేటైన ఫ్లయిట్లు, పోగొట్టుకున్న లగేజీకి పరిహారం పొందడం వంటివి ప్రయాణికులకు తెలుస్తాయి.
News March 24, 2025
జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్

TG: వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కలిసి కోరనున్నారు.
రేవంత్‌తో పాటు జపాన్‌కు శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లనున్నారు.