News March 18, 2024

ఏపీ ప్రజల మద్దతు ఎన్డీయేకే: ప్రధాని మోదీ

image

AP: ప్రజాగళం సభపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సభకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రజానీకం ఎన్డీయేకు పూర్తి మద్దతుగా ఉన్నారు. అవినీతిమయమైన వైసీపీ పాలన నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని ప్రజలు నమ్ముతున్నారు’ అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

Similar News

News November 16, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.210-230 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.230-240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, ప.గో. జిల్లా భీమవరంలో రూ.230-250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మటన్ కేజీ రూ.800కు పైగానే ఉంది. మరి మీ ఏరియాలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 16, 2025

కుమారుడి ఫస్ట్ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

image

పైరసీ మూవీ వెబ్‌సైట్ ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అతడు గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి CEOగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడని, తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగలిగేలా పట్టు సాధించాడని సమాచారం. అయితే తనను పోలీసులు పసిగట్టరనే ధీమాతో విదేశాల నుంచి కూకట్‌పల్లికి వచ్చి దొరికిపోయాడు.