News December 3, 2024

దేశ ప్ర‌జ‌లారా త‌ర‌లిరండి.. ద‌క్షిణ కొరియా ప్ర‌తిప‌క్ష నేత పిలుపు

image

సైనిక పాల‌న విధిస్తూ అధ్య‌క్షుడు తీసుకున్న‌ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ దేశ ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి నిర‌స‌న తెల‌పాల‌ని ప్ర‌తిప‌క్ష డెమోక్రటిక్ పార్టీ నేత లీ జే-మ్యూంగ్ పిలుపునిచ్చారు. అలాగే చ‌ట్ట‌స‌భ స‌భ్యులు నేష‌న‌ల్ అసెంబ్లీలో స‌మావేశం కావాల‌ని ఆదేశించారు. మ‌రోవైపు సైనిక పాల‌న నిర్ణ‌యాన్ని అధికార పీపుల్స్ పవర్ పార్టీ నాయకుడు హాన్ డాంగ్-హూన్ సైతం త‌ప్పుబ‌ట్టారు. దీన్ని అడ్డుకుంటామ‌న్నారు.

Similar News

News November 24, 2025

చదరంగం నేర్పించే జీవిత పాఠం!

image

చదరంగం ఆట లైఫ్‌లో ఛాలెంజెస్‌ను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. చెస్‌లో ఎదుటి వ్యక్తి తప్పు చేస్తాడని ఎదురుచూస్తే మనం గెలవలేం. లైఫ్‌లో కూడా అలా వేచి చూడకుండా మీ స్ట్రాటజీతో అవకాశాలను క్రియేట్ చేసుకోండి. 16 పావులూ మన వెంటే ఉన్నా.. ఆఖరి నిమిషంలో మన యుద్ధం మనమే చేయాలి. లైఫ్‌లో కూడా అంతే.. ఇతరులపై డిపెండ్ అవ్వకుండా మీకోసం మీరే పోరాడాలి. ఇబ్బందులు వచ్చినప్పుడే మన సామర్థ్యమేంటో బయట పడుతుంది.

News November 24, 2025

రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

image

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.

News November 24, 2025

అనంతమైన పుణ్యాన్ని ఇచ్చే విష్ణు నామం

image

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః|
ఛన్దో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః||
విష్ణు సహస్ర నామాలకు రుషి ‘వేదవ్యాసుడు’. ఈ స్తోత్రం ఛందస్సు ‘అనుష్టుప్’. ఈ పారాయణంలో దేవకీ పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం. అయితే శ్లోకాలను పఠించే ముందు భక్తులు వివరాలు తెలుసుకోవాలి. విష్ణు నామాల మూలం, ఛందస్సు, ఆరాధ దైవం గురించి తెలుసుకొని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>