News December 3, 2024
దేశ ప్రజలారా తరలిరండి.. దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత పిలుపు

సైనిక పాలన విధిస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ దేశ ప్రజలు తరలివచ్చి నిరసన తెలపాలని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేత లీ జే-మ్యూంగ్ పిలుపునిచ్చారు. అలాగే చట్టసభ సభ్యులు నేషనల్ అసెంబ్లీలో సమావేశం కావాలని ఆదేశించారు. మరోవైపు సైనిక పాలన నిర్ణయాన్ని అధికార పీపుల్స్ పవర్ పార్టీ నాయకుడు హాన్ డాంగ్-హూన్ సైతం తప్పుబట్టారు. దీన్ని అడ్డుకుంటామన్నారు.
Similar News
News February 10, 2026
కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.
News February 10, 2026
నెలకు రూ.90వేల జీతం.. నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో 12 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech(కెమికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal2.nrl.co.in
News February 10, 2026
ఉపవాసం: ఏ ఆహారం తీసుకోవాలి?

కఠిన ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, దుంపలు తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో మినుములు, బూడిద గుమ్మడి పదార్థాలకు దూరంగా ఉండాలి. వంటల కార్యక్రమాలు చూడటం, ఆహారం గురించి చర్చించడం మనస్సును మళ్లిస్తుంది. అందుకే వాటిని నివారించాలి. బియ్యం లేదా బార్లీతో చేసిన ఆహారంతో ఉపవాసం విరమించడం శ్రేయస్కరం. విరమణ తర్వాత కూడా ఇడ్లీ, దోశ వంటి మినుములతో కూడిన పదార్థాలను తినకూడదని పండితులు సూచిస్తున్నారు.


