News April 18, 2024
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్

లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని BJP ఎక్కువ ఊహించుకుంటోందని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల టాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180 సీట్లు కూడా రావని అంతకుముందు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
ఎలుకలతో పంటకు తీవ్ర నష్టం.. ఎలా నివారిద్దాం?

వ్యవసాయంలో చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల తర్వాత ఎక్కువ నష్టం ఎలుకల వల్ల వాటిల్లుతోంది. విత్తన దశ నుంచి కోత, నిల్వ వరకు ఎలుకలు ఏదో రూపంలో పంటకు, ఉత్పత్తులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అనేక చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్నకు వీటి ముప్పు చాలా ఎక్కువ. విషపు ఎర, ఇనుప తీగల ఉచ్చు, పొగపెట్టడం ద్వారా ఎలుకలను ఎలా నిర్మూలించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 16, 2025
టీచర్లకు బోధనేతర పనులొద్దు!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని టీచర్లకు బోధనేతర పనులు కేటాయించొద్దని అధికారులకు విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజు ఆదేశాలిచ్చారు. టెన్త్ విద్యార్థులకు రోజూ స్లిప్ టెస్టులు నిర్వహించాలన్నారు. కాగా పాఠశాల స్థాయిలోనే క్వశ్చన్ పేపర్లు తయారుచేసే వెసలుబాటు కల్పించారు. గతేడాది వాటిని పైస్థాయి నుంచి పంపేవారు. ఉత్తీర్ణత శాతం పెంపు బాధ్యత కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారిపై ఉండనుంది.
News December 16, 2025
జింకు ఫాస్పేట్ ఎరతో ఎలుకల నివారణ

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.


