News September 15, 2024
స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోకపోతే చంద్రబాబును ప్రజలు క్షమించరు: వడ్డే
AP: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కూటమి నేతలు స్పందించకపోవడం దారుణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోకపోతే చంద్రబాబును ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వైజాగ్ వచ్చి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. ఆ శాఖ సహాయ మంత్రిగా APకి చెందిన శ్రీనివాసవర్మ ఉన్నప్పటికీ బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడిందని దుయ్యబట్టారు.
Similar News
News October 4, 2024
గోళ్లను బట్టి ఆరోగ్యాన్ని చెప్పొచ్చు: పోషకాహార నిపుణులు
గోళ్లు చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చని న్యూట్రీషనిస్ట్ సిమ్రున్ చోప్రా చెబుతున్నారు. ‘సన్నగా, మెత్తగా ఉండే గోళ్లు విటమిన్ బి, కాల్షియం, ఐరన్ లోపానికి సూచన కావొచ్చు. స్పూన్‌లా మధ్యలో గుంట పడినట్లుగా ఉండే గోళ్లు రక్తహీనత, లివర్ సమస్యలను, తెల్ల మచ్చలుండే గోళ్లు జింక్ లోపాన్ని సూచిస్తుండొచ్చు. అధిక ధూమపానానికి, థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలకు పసుపు రంగు గోళ్లు సూచన కావొచ్చు’ అని వివరించారు.
News October 4, 2024
ఆ దాడులు చట్టబద్ధమైనవే: ఇరాన్ సుప్రీం ఖమేనీ
ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల దాడులు చట్టబద్ధమైనవని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. ఐదేళ్ల తరువాత ఆయన బహిరంగ ఉపన్యాసం ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కూడా చట్టబద్ధమైనదిగా ఆయన అభివర్ణించారు. అఫ్గానిస్థాన్ నుంచి యెమెన్ వరకు, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ వరకు దురాక్రమణులను తిప్పికొట్టేందుకు ముస్లిం దేశాలు భద్రతను పటిష్ఠం చేసుకోవాలన్నారు.
News October 4, 2024
చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది: జగన్
AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.