News July 8, 2024

పీరియడ్స్ సెలవులు.. సుప్రీంకోర్టు ఏమందంటే?

image

మహిళా ఉద్యోగులకు పీరియడ్స్ సెలవులు ఇవ్వడం మంచి నిర్ణయమే అయినా దీనివల్ల వారికి ఉద్యోగావకాశాలు తగ్గిపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు పీరియడ్స్ సెలవులు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. అది విధానపర నిర్ణయమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. బిహార్‌ ప్రభుత్వం మహిళలకు నెలకు 2 రోజుల పీరియడ్ లీవ్స్ ఇస్తుండగా కేరళ సర్కార్ విద్యార్థినులకు 3 రోజుల సెలవులు ప్రకటించింది.

Similar News

News October 6, 2024

పొత్తుకు పీడీపీ ఆస‌క్తిపై ఫ‌రూక్ అబ్దుల్లా ఏమన్నారంటే?

image

JKలో NC-కాంగ్రెస్ కూట‌మికి మ‌ద్ద‌తుపై PDP నేత‌లు సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని NC చీఫ్ ఫ‌రూక్ అబ్దుల్లా స్వాగ‌తించారు. BJPకి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని PDP సంకేతాలిచ్చింది. దీనిపై ఫరూక్ స్పందిస్తూ ‘అంద‌రం ఒకే ల‌క్ష్యంతో ఉన్నాం. ద్వేషాన్ని నాశనం చేయాలి. JKని ఏకం చేయాల్సి ఉంది’ అని తెలిపారు. Exit Pollsపై స్పందించ‌డానికి ఆయన నిరాకరించారు. Oct 8న ఎవ‌రి స్థానం ఏంటో తెలుస్తుందన్నారు.

News October 6, 2024

పుట్టినప్పటి నుంచి ఒకే సైజులో ఉండే అవయవం!

image

మానవ శరీరంలోని అన్ని భాగాలు వయసును బట్టి పెరుగుతూ ఉంటాయి. అయితే, ఓ ఇంద్రియం మాత్రం చనిపోయేవరకు ఒకే సైజులో ఉంటుందని కార్నెల్ యూనివర్సిటీ న్యూరోబయాలజిస్ట్ చెప్పారు. ‘గర్భంలో ఉన్నప్పటి నుంచి పుట్టిన మూడు నెలల వరకు కళ్లు వేగంగా పెరుగుతాయి. అప్పటి నుంచి ఒకే పరిమాణంలో ఉంటాయి. అదే ముక్కు, చెవులు మాత్రం పెరుగుతాయి’ అని తెలిపారు. అయితే, మరికొందరు మాత్రం 20 ఏళ్ల వరకు కళ్లు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.

News October 6, 2024

ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా?: CM

image

TG: 20ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు పేదోడి దుఃఖం తెలియదా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? ZP మెంబర్ నుంచి సీఎం అయ్యాను. వాళ్లందర్నీ ఎలా ఆదుకోవాలో చెప్పండి. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసింది. పేదల కోసం మరో రూ.10వేల కోట్లు అప్పు చేద్దాం. KCRకు 1000ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. BRS ఖాతాలో రూ.1500కోట్లున్నాయి. అదంతా పేదల డబ్బే’ అని రేవంత్ అన్నారు.