News March 18, 2025

‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

image

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.

Similar News

News February 1, 2026

పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

image

దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల సిలిండర్ ధరను రూ.49 పెంచాయి. ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో రిటైల్‌లో ₹1,740.50 పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ట్రెండ్స్, దేశీయ వ్యయాల ఆధారంగా ధరలను కంపెనీలు సవరించాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. పాత ధరలే కొనసాగనున్నాయి.

News February 1, 2026

గుంటూరు జిల్లాలో 45 పోస్టులు.. అప్లై చేశారా?

image

AP: గుంటూరు జిల్లాలోని UPHC, PHCలో ఖాళీగా ఉన్న 45 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, DMLT, BSc(BZC), PG డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, PGDCA అర్హతగల వారు <>DHMO<<>>లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://guntur.ap.gov.in

News February 1, 2026

సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న నిర్మల

image

కేంద్ర మంత్రి నిర్మల 75 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్నారు. 2 భాగాల బడ్జెట్‌లో పార్ట్ Aకు సాధారణంగా ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక స్థితిని సమీక్షించే, విధాన దిశను నిర్దేశించే ముఖ్యమైన అంశాలు అందులో ఉంటాయి. పన్ను సంబంధిత ప్రకటనలకే పార్ట్Bని పరిమితం చేస్తారు. ఈ సారి పార్ట్ B ద్వారానే ఇండియా ఎకనమిక్ విజన్‌ను నిర్మల ఆవిష్కరించనున్నారు. ట్రేడ్, కస్టమ్స్, ఎగుమతులు, తయారీపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.