News April 11, 2024
బౌద్ధంలో చేరాలంటే అనుమతి తప్పనిసరి: గుజరాత్ ప్రభుత్వం

గుజరాత్‌లో ప్రతి సంవత్సరం దసరాతో పాటు ఇతర పండగల సందర్భంగా మత మార్పిడులు జరుగుతుంటాయి. ఎక్కువగా దళితులు బౌద్ధత్వంలోకి మారుతుంటారు. అయితే ఈ విషయానికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధిజం కూడా ఒక మతమేనని, అందులో చేరాలంటే గుజరాత్ మత స్వేచ్ఛా చట్టం 2003 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సర్క్యులర్ విడుదల చేసింది.
Similar News
News April 11, 2026
ఎల్లుండి టెట్ నోటిఫికేషన్?

TG: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 13న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో TET నిర్వహించారు. ఇప్పుడు రెండో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశముంది.
News April 11, 2026
WTCలో మార్పులు.. ఇక నుంచి 12 జట్లు?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పలు మార్పులు జరిగే అవకాశముంది. 2027 నుంచి మొదలయ్యే WTC సైకిల్‌లో జట్ల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాలని ICC వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. కొత్తగా ZIM, IRE, AFGను చేర్చాలంది. కాగా ప్రస్తుతం కనీసం 2 మ్యాచుల సిరీస్‌ల ఫలితాలు WTC pts టేబుల్‌కి యాడ్ అవుతున్నాయి. ఇక నుంచి సింగిల్ టెస్ట్ సిరీస్‌ల ఫలితాలనూ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీనిపై ICC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News April 11, 2026
‘దీపం’ లబ్ధిదారులు PNGకి మారినా రాయితీ ఇస్తాం: CM CBN

AP: దీపం పథకం లబ్ధిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG)కి మారినా వారికి ఇచ్చే రాయితీని ఖాతాల్లో జమ చేస్తామని CM CBN వెల్లడించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సమీక్షించిన ఆయన, రాబోయే 6 నెలల్లో 10 లక్షల PNG కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు టార్గెట్‌ను నిర్దేశించారు. శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనులు వెంటనే పూర్తయ్యేలా చూడాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఫోన్‌లో కోరారు.


