News June 15, 2024

TDP గెలిచిందనే అక్కసుతో వాటర్ ట్యాంకులో పురుగు మందు?

image

AP: అనంతపురం జిల్లా కనేకల్ మం. తుంబిగనూరులో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీటి శుద్ధజల ట్యాంకులో నిన్న రాత్రి పురుగు మందు కలిపి విషప్రయోగానికి కుట్ర చేశారు. ఉదయాన్నే ట్యాంకులో డబ్బా గుర్తించి, ఎవరూ ఆ నీళ్లు తాగకపోవడంతో ముప్పు తప్పింది. టీడీపీ గెలిచిందన్న అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆ గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Similar News

News November 27, 2025

పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

image

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News November 27, 2025

పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

image

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్‌ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.

News November 27, 2025

ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <>ANRF<<>>)లో 7 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హతగల అభ్యర్థులు జనవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం సైంటిస్ట్-Dకు నెలకు రూ.78,800-రూ.2,09200, సైంటిస్ట్ -C పోస్టుకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: serb.gov.in/