News January 2, 2025
పెంపుడు కుక్క మృతి.. దాని చైన్తోనే ఉరేసుకున్న యజమాని
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర్(33) ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. మంగళవారం అది అనారోగ్యంతో చనిపోగా ఖననం చేశారు. అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. కుక్కకు ఉపయోగించిన చైన్తోనే ఉరేసుకొని చనిపోయాడు.
Similar News
News February 5, 2025
IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల
IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <
News February 5, 2025
మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు
AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
News February 5, 2025
భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.