News January 9, 2025
‘గేమ్ ఛేంజర్’ మిడ్‌నైట్ షోలు ఆపాలని పిటిషన్.. HC సెటైరికల్ రిప్లై
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736411688713_1226-normal-WIFI.webp)
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మిడ్ నైట్ షోలను నిలిపివేయాలని కొందరు ఏపీ హైకోర్టు(HC)ను ఆశ్రయించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు మరణించిన ఘటనను పేర్కొంటూ షోను నిలిపివేయాలని కోర్టును కోరారు. దీనికి ‘శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణిస్తే ప్రయోగాలు ఆపేయ్యాలి అన్నట్లుగా మీ అభ్యర్థన ఉంది’ అని హైకోర్టు వ్యంగ్యంగా స్పందించింది.
Similar News
News January 24, 2025
నేటి ముఖ్యాంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737653342582_1226-normal-WIFI.webp)
* ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల దావోస్ పర్యటన
* తెలంగాణకు రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం
* ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్
* టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్‌దే: అచ్చెన్నాయుడు
* మే నెలలో ‘తల్లికి వందనం’: డీబీ వీరాంజనేయ స్వామి
* దావోస్ ఖర్చెంత? పెట్టుబడులు ఎన్ని?: అంబటి
* మూడో రోజూ సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ సోదాలు
News January 24, 2025
రాబోయే రోజుల్లో ఇలాగే వినోదాన్ని అందిస్తా: అనిల్ రావిపూడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737649215128_1226-normal-WIFI.webp)
పదేళ్ల క్రితం తెరకెక్కించిన ‘పటాస్’ సినిమా ఇదే తేదీన విడుదలై తన జీవితాన్ని మార్చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అది తన దర్శకత్వానికి పునాది మాత్రమే కాదని ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కారణమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన నిర్మాతలు, నటులు, ప్రేక్షకులు అంతా తన కుటుంబమేనని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా అందరికీ వినోదాన్ని అందిస్తానని హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.
News January 24, 2025
స్వియాటెక్‌కు షాక్.. ఫైనల్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737651266859_1226-normal-WIFI.webp)
టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. రెండో సీడ్ స్వియాటెక్‌కు ఆస్ట్రేలియన్ ప్లేయర్ కేస్ షాకిచ్చారు. సెమీఫైనల్ మ్యాచులో 5-7, 6-1, 7-6 తేడాతో కేస్ గెలుపొందారు. ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌లో సబలంక 6-4, 6-2 తేడాతో బడోసాపై విజయం సాధించారు. ఎల్లుండి జరిగే ఫైనల్లో కేస్, సబలంక తలపడనున్నారు. మరోవైపు రేపు మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో జకోవిచ్ రెండో సీడ్ జ్వెరెవ్‌తో అమీ తుమీ తేల్చుకోనున్నారు.