News May 12, 2024
ఓటు వేస్తే పెట్రోల్/డీజిల్ ఫ్రీ

ఎన్నికల్లో ఓటు వేసిన వారికి పలు చోట్ల కొన్ని కంపెనీలు బంపరాఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఓ బైక్ షోరూం అలాంటి ప్రకటనే చేసింది. ఓటేసిన వారు తమ చేతికి ఉన్న సిరా చుక్కని చూపిస్తే ఫ్రీ ఆయిల్(పెట్రోల్/డీజిల్) టాప్-అప్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఎంత ఇస్తామనేది మాత్రం వెల్లడించలేదు. ఏపీలోని ఆరు చోట్ల ఈ నెల 15 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంటూ చేసిన ఓ ప్రకటన వైరలవుతోంది.
Similar News
News February 18, 2025
BREAKING: ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2024 APRలో ఈ నోటిఫికేషన్ విడుదలవ్వగా జులైలో టైర్-1, NOVలో టైర్-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్‌లో పొందుపర్చింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News February 18, 2025
9 మంది ESI ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేసిన మంత్రి

AP: రాజమహేంద్రవరం ESI ఆస్పత్రిలో 9మంది ఉద్యోగులపై సన్పెన్షన్ వేటు పడింది. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు పెట్టి వెళ్లడాన్ని నిన్నటి ఆకస్మిక పర్యటనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తించి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. రాష్ట్ర బీమా వైద్య సేవల డైరెక్టర్ ఆంజనేయులు ఇవాళ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు తదితరులపై వేటు పడింది.
News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.