News October 3, 2024
పెట్రోల్ ధరల పెంపు?

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.
Similar News
News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
News November 19, 2025
సైలెంట్‌గా రీఛార్జ్ వ్యాలిడిటీని తగ్గించిన BSNL!

ఎయిర్టెల్, జియోలే కాకుండా ప్రభుత్వరంగ సంస్థ BSNL కూడా నిశ్శబ్దంగా రీఛార్జ్ ప్యాకేజీల్లో మార్పులు తీసుకొస్తోంది. BSNL తన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 28 రోజుల నుంచి 22 రోజులకు కుదించింది. గతంలో ఇదే రీఛార్జ్‌పై 35 రోజులు వ్యాలిడిటీ ఉండేది. ధరను పెంచకుండా ఇలా ప్లాన్ చేస్తోంది. ఇది 20% కంటే ఎక్కువ టారిఫ్ పెంపునకు సమానమని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
News November 19, 2025
MBNR: వాలీబాల్ ఎంపికలు.. విజేతలు వీరే!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొనగా..
✒బాలికల విభాగంలో
1.బాలానగర్
2.మహమ్మదాబాద్
✒బాలుర విభాగంలో
1.నవాబ్ పేట
2. మహబూబ్ నగర్ జట్లు గెలిచినట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. ఎంపికైన వారికి ఉమ్మడి జిల్లా సెలక్షన్‌కు పంపిస్తామన్నారు.


