News March 25, 2025

లీటర్ పెట్రోల్‌పై రూ.17 తగ్గించాలి: షర్మిల

image

పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు లీటరుపై రూ.17 తగ్గించాలని APCC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.109.60, డీజిల్ రూ.97.47గా ఉంది. TN, TGతో పోల్చినా APలో ధరలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ మీద పన్నుల తగ్గింపుపై TDP, YCP నీచ రాజకీయాలు చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు CBN రూ.17 తగ్గించవచ్చని చెప్పారు. ఇప్పుడు వారి హామీని నిలబెట్టుకోవాలి’ అని కోరారు.

Similar News

News April 22, 2025

నేటితో ముగియనున్న సీఎం జపాన్ పర్యటన

image

TG: పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ హిరోషిమాకు వెళ్లి పీస్ మెమోరియల్‌ను రేవంత్ టీమ్ సందర్శించనుంది. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ ఛైర్మన్‌తో భేటీ కానుంది. మాజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు పయనం కానుంది.

News April 22, 2025

ప్రధాని మోదీ గ్రేట్ లీడర్: జేడీ వాన్స్

image

ఢిల్లీలో నిన్న రాత్రి PM మోదీ, US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు Xలో స్పందించారు. ‘ట్రంప్‌తో మీటింగ్‌లో చర్చించిన అంశాల పురోగతిపై వాన్స్‌ను అడిగి తెలుసుకున్నా. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మన ప్రజల భవిష్యత్‌తో పాటు ప్రపంచానికి తోడ్పడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘మోదీ గొప్ప లీడర్. భారత ప్రజలతో స్నేహం, సహకారం బలోపేతానికి కృషి చేస్తా’ అని వాన్స్ పేర్కొన్నారు.

News April 22, 2025

సొంత వాహనాల్లో తిరుమల వెళ్తున్నారా?

image

AP: అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సొంత వాహనాల్లో తిరుమలకొచ్చే భక్తులకు తిరుపతి SP సూచనలు చేశారు. ఇటీవల రెండు కార్లు దగ్ధమైన నేపథ్యంలో జాగ్రత్తలు చెప్పారు. ముందే వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలని, రేడియేటర్ బెల్ట్, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవాలన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్లు ఘాట్ రోడ్డు ఎక్కడానికి ముందు 30 ని. వాహనాన్ని ఆపాలని, ఘాట్ రోడ్డు ఎక్కే సమయంలో AC ఆఫ్ చేసుకోవడం మంచిదని సూచించారు.

error: Content is protected !!