News June 15, 2024

కర్ణాటకలో పెట్రోల్ ధరలు పెంపు

image

కర్ణాటక ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.02 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజా పెంపుతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కి చేరగా డీజిల్ రేట్ రూ.88.94గా ఉంది. కాగా రాష్ట్రంలో 2021 నవంబర్‌లో చివరిసారి ఇంధన ధరలను సవరించారు.

Similar News

News November 9, 2025

ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్‌ల‌కు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

News November 9, 2025

చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

image

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.

News November 9, 2025

భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

image

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్‌లో భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.