News June 15, 2024
కర్ణాటకలో పెట్రోల్ ధరలు పెంపు
కర్ణాటక ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3.02 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజా పెంపుతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కి చేరగా డీజిల్ రేట్ రూ.88.94గా ఉంది. కాగా రాష్ట్రంలో 2021 నవంబర్‌లో చివరిసారి ఇంధన ధరలను సవరించారు.
Similar News
News September 13, 2024
టీసీఎస్‌లో వేల మంది ఉద్యోగులకు ఐటీ తాఖీదులు
టీసీఎస్‌లో పని చేస్తున్న 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాలని, రిఫండ్లు సైతం ఆపేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతో TDS వివరాలు ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో అప్‌డేట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిపై అధికారులతో చర్చిస్తున్నామని, వేచి ఉండాలని ఉద్యోగులకు TCS సమాచారం అందించింది.
News September 13, 2024
అందుకే అతడికి లవ్ బ్రేకప్ చెప్పేశా: రకుల్
రిలేషన్ వాల్యూ తెలియక గతంలో ఓ చిన్న కారణంతో తనను ప్రేమించిన వ్యక్తిని రిజెక్ట్ చేశానని హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలిపారు. ‘హోటల్లో నా కోసం అతను ఆర్డర్ చేసిన ఫుడ్ నచ్చలేదు. నేను కోరిన ఫుడ్‌ని తక్కువ చేసి చూశాడు. దీంతో బ్రేకప్ చెప్పా. నా భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తి నాకు అనవసరం అనిపించింది’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడారు.
News September 13, 2024
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న తుదిశ్వాస విడిచిన సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి, రేపు ఉదయం హైదరాబాద్‌కు వస్తారు. కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించనున్న ఆయన, ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయల్దేరుతారు.