News December 1, 2024
PF డబ్బులు ఇక ATM నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు!

కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న EPFO 3.0 ఖాతాదారుల అత్యవసరాలను తీర్చనుంది. 2025 జూన్ నుంచి ఉద్యోగులు PF ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని EPFO కార్డు (ATM కార్డు మాదిరి)తో డ్రా చేసుకోనే సౌకర్యం ఉంటుందని తెలుస్తోంది. అలాగే రిటైర్మెంట్ తరువాత అధిక ప్రయోజనాలను పొందేందుకు అధిక PF కూడా చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. అయితే ఇందులో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ యథాతథంగా ఉంటుంది.
Similar News
News February 7, 2026
భారత వృద్ధి రేటును పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

2026 సంవత్సరానికి సంబంధించి భారత రియల్ GDP వృద్ధి రేటు అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.9%కి సవరించింది. భారత వస్తువులపై టారిఫ్‌లను 25% నుంచి 18%కి తగ్గిస్తూ US నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఎగుమతులు పెరగడమే కాకుండా, ప్రైవేట్ పెట్టుబడులూ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. దీంతో రూపాయిపై ఒత్తిడి తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని వెల్లడించింది.
News February 7, 2026
ఒక్క మ్యాచ్.. ఎన్నో రికార్డులు!

*U19 WC ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన తొలి క్రికెటర్ వైభవ్.
* ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు- 722 రన్స్ (ఇండియా-411, ఇంగ్లండ్-311)
*పరుగుల పరంగా ఫైనల్‌లో అతిపెద్ద విజయం- 100 రన్స్
*Youth ODIలో అత్యధిక సిక్సులు- 31
*ఛేజింగ్‌లో హయ్యెస్ట్ స్కోరు- 311 రన్స్(ఇండియాతో కలిసి ఇంగ్లండ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది)
*ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
News February 7, 2026
ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.


