News April 3, 2025
PF విత్డ్రా మరింత సులభం: EPFO

EPFO నుంచి నగదు విత్డ్రా మరింత ఈజీ కానుంది. ఇకపై డబ్బు విత్డ్రా చేయడానికి క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ ఇవాళ ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ను యజమానులు ధ్రువీకరించాల్సిన అవసరం లేదంది. దీని ద్వారా కోట్ల మందికి సులభంగా క్లెయిమ్ సెటిల్ కానుంది. ఏడాదిగా కోటిన్నర మందిపై నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం కావడంతో అందరికీ ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News April 4, 2025
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే 2 గంటల్లో తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విశ్లేషకులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
News April 4, 2025
ST సర్టిఫికెట్ జారీకి పేరెంట్స్ ఇద్దరూ ట్రైబల్స్ కానక్కర్లేదు: కలకత్తా HC

పేరెంట్స్లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో పిల్లలకు ST సర్టిఫికెట్ నిరాకరించడం తగదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తల్లి ట్రైబల్ కాగా తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తని అధికారులు అర్జీని తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24గంటల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.
News April 4, 2025
వక్ఫ్ బిల్లుతో అన్యాయం, అవినీతి అంతం: అమిత్ షా

పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు పాస్ అవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా Xలో స్పందించారు. ఇక అవినీతి, అన్యాయం అంతమైనట్లేనని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు న్యాయం, సమానత్వానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ముస్లిం కమ్యూనిటీలోని పేదలు, మహిళలు, పిల్లలకు లబ్ధి కలుగుతుందన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో పాటు ఉభయ సభల్లో బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.