News November 30, 2025

PGRS – డయల్ యువర్ కమిషనర్ రద్దు: కమిషనర్

image

“దిత్వా” తుఫాను ప్రభావంతో సోమవారం నగరపాలక సంస్థలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తిరుపతి కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. అధికారులు, సిబ్బంది తుఫాను సహాయక చర్యల్లో నిమగ్నం అవుతుండటంతో ప్రజలు కార్యాలయానికి రాకూడదన్నారు. అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్ 0877-2256766, 9000822909 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 14, 2026

కామారెడ్డి: ఈనెల 15 నుంచి ఇంటర్ ప్రత్యేక తరగతులు

image

కామారెడ్డి జిల్లాలో ఆశించినంత మేర ఇంటర్ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నెల 15 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తామన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు చెల్లించాలని సూచించారు.

News April 14, 2026

ADB: పేకాటలో పట్టుబడ్డ కీలక నేతలు

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీజేపీ నేత, భైంసా మున్సిపల్ ఛైర్మన్ దత్తాద్రి, ఆర్మూర్ కాంగ్రెస్ కౌన్సిలర్ వెంటకట్ గౌడ్ అలియాస్ రవి గౌడ్, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వారి నుంచి రూ.1.79లక్షల నగదు, 2కార్లు, 6 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు మంచి చెడ్డలు చెప్పేవారు ఇలా పట్టుబడటం చర్చనీయాంశమయ్యింది.

News April 14, 2026

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

image

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల వివరాల ప్రకారం.. భిక్కనూర్‌లో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత నమోదైంది. బోమనదేవిపల్లి, సోమూర్, జుక్కల్ ప్రాంతాల్లో కూడా 42.8°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40°C నుంచి 43°C మధ్య నమోదవ్వడంతో ‘అలర్ట్’ పరిస్థితులు కొనసాగుతున్నాయి.