News August 26, 2024
ఫార్మా ప్రమాదాలపై విచారణ జరపాలి: CPM

AP: ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఫ్యాక్టరీల్లో భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు దురదృష్టకరమని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన 119 ప్రమాదాల్లో 150 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాలపై నివేదికలు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News November 14, 2025
బిహార్ రిజల్ట్: కాంగ్రెస్ కుదేలు

బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి నిరాశపరిచింది. 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లోనే లీడింగ్లో ఉంది. 55 స్థానాల్లో వెనుకబడింది. మరోవైపు MGB మిత్రపక్షం CPI(ML) Liberation 20 సీట్లలోనే పోటీ చేసినా 7 చోట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2020లో 70 సీట్లలో పోటీ చేసి 19 చోట్లే గెలిచింది. ప్రస్తుతం 143 సీట్లలో పోటీ చేసిన RJD 32 చోట్ల లీడ్లో ఉంది.
News November 14, 2025
₹11,399 కోట్లతో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధి

TG: హ్యామ్ విధానంలో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ₹11,399.33 కోట్లతో 5824 KM మేర రహదారులను తీర్చిదిద్దనుంది. ఫేజ్1లో నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, కుమరంభీం జిల్లాల్లోని 30 రోడ్ల అభివృద్ధికి ఉత్తర్వులిచ్చింది. కాగా గతంలో అనుమతులిచ్చిన 7 రోడ్లను ఫేజ్1 నుంచి తొలగించి కొత్తవి చేర్చారు. GO విడుదలతో టెండర్లు పిలవనున్నారు.
News November 14, 2025
23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.


