News October 8, 2024

19 నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్

image

TG: బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. 22 వరకు ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలన‌కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 21 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 28న సీట్ల కేటాయింపు ఉంటుంది. 30వ తేదీలోపు విద్యార్థులు కాలేజీల్లో చేరాలి. నవంబర్ 4 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.

Similar News

News December 7, 2025

RGSSHలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

image

ఢిల్లీలోని <>రాజీవ్‌గాంధీ<<>> సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ 33 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌, డీఎం, ఎంసీహెచ్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రేపు ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. ఉదయం 10గం. నుంచి 12గం. వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు, రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://rgssh.delhi.gov.in/

News December 7, 2025

DEC9న ‘విజయ్ దివస్’ నిర్వహణ: KTR

image

TG: KCR ఆమరణ దీక్ష వల్ల 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని BRS నేత KTR పేర్కొన్నారు. ‘11 రోజుల దీక్ష ఫలించి DEC9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. KCR త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆరోజును విజయ దివస్‌గా సంబరాలు జరుపుకోవాలి’ అని పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సులో పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలున్నందున గ్రామాల్లో కాకుండా నియోజకవర్గాల్లో జరపాలన్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టాలో ఆయన వివరించారు.

News December 7, 2025

10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

image

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్‌యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.