News June 12, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ నిరాకరణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వాళ్లను విచారించాల్సి ఉందని, బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం వారు చంచల్గూడ జైలులో ఉన్నారు.
Similar News
News January 11, 2026
HYD: కార్పొరేషన్ కోసం లష్కర్లో లడాయి

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.
News January 11, 2026
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో ఉద్యోగాలు

ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 45 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JSOకు నెలకు రూ.68,697, JSAకు రూ.42,632 చెల్లిస్తారు. https://fsl.delhi.gov.in
News January 11, 2026
ఇంటికి చేరుకోవడమే పెద్ద ‘పండుగ’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ట్రాఫిక్, మరోవైపు సమయానికి బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకోవడమే పెద్ద పండుగగా భావిస్తున్నారు. VJA-HYD హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అటు HYDలోని బస్టాండ్లలో వచ్చిన వెంటనే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.


