News June 12, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు బెయిల్ నిరాకరణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వాళ్లను విచారించాల్సి ఉందని, బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

Similar News

News March 17, 2025

BC రిజర్వేషన్ల పెంపు కోసం PM మోదీని కలుద్దాం: CM రేవంత్

image

TG: BC రిజర్వేషన్ల పెంపు సాధనకై PM మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలని అసెంబ్లీలో CM రేవంత్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించేలా పోరాడాలన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన BRS, BJP, MIMతో సహా ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

News March 17, 2025

మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి: KTR

image

TG: జర్నలిస్టులను రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని KTR అన్నారు. CMను విమర్శిస్తూ వీడియోలను పోస్ట్ చేసి జైలుపాలైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రేవతి, తన్వికి జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులకూ జరగొచ్చు. మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి’ అని పేర్కొన్నారు. కాగా రేవతి, తన్వికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

News March 17, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును TGPSC విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు TGPSC పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షా 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.

error: Content is protected !!