News February 21, 2025
పబ్లిక్ ఇష్యూకు రానున్న ఫోన్ పే

పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు తాము సన్నాహాలు ప్రారంభించినట్లు డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే ప్రకటించింది. ‘మా సంస్థ సేవలు ప్రారంభమై ఈ ఏడాదికి పదేళ్లు పూర్తవుతోంది. 12 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకున్నాం. ఈ సందర్భంగా ఐపీఓకు రావడం మా సంస్థ చరిత్రలో ఓ మైలురాయి’ అని పేర్కొంది. దేశంలో డిజిటల్ చెల్లింపు యాప్‌లలో ఫోన్ పే ఏకంగా 48శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
Similar News
News March 24, 2025
వైజాగ్-సికింద్రాబాద్ ట్రైన్ అలర్ట్

TG: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లోక్‌మాన్య తిలక్ , సంబల్ పూర్ సూపర్ ఫాస్ట్, విశాఖ-నాందేడ్, విశాఖ-సాయినగర్ వీక్లీ ఎక్స్‌ప్రైస్‌ల రూటు మార్చనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 22నుంచి ఈ మార్పులు చేపట్టనున్నారు. దారి మళ్లించడంతో అదనపు ప్రయాణం తమకు భారమవుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 24, 2025
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
News March 24, 2025
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.