News May 26, 2024
PHOTO: గుట్టలుగా నోట్ల కట్టలు

నాసిక్‌లో ఆదాయ పన్ను శాఖ తాజాగా నిర్వహించిన సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. సురానా జ్యువెల్లర్స్ సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన రెయిడ్స్‌లో రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 55మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొనడం విశేషం.
Similar News
News February 6, 2025
BREAKING: భారత్ విజయం

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.
News February 6, 2025
ఏనుగులూ పగబడతాయ్!

పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.
News February 6, 2025
భారత క్రికెట్‌కు లతా మంగేష్కర్ సాయం

గాన కోకిల లతా మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ఆమె టీమ్ఇండియాకు చేసిన సహాయం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జట్టు కోసం నిధుల సేకరణ కోసం ఢిల్లీలో 1983లో కన్సర్ట్ నిర్వహించారు. ఆమె సోదరుడు పండిత్ హృద్యనాథ్ స్వరపరిచిన ‘భారత్ విశ్వ విజేత’ సాంగ్‌ను లతా పాడారు. దీనికి కపిల్ దేవ్ టీమ్, సపోర్ట్ స్టాఫ్‌తో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హాజరయ్యారు. వచ్చిన రూ.20లక్షలను ఆమె ప్లేయర్లకు అందించారు.