News November 18, 2024
PHOTO: ఒకే ఫ్రేమ్‌లో క్రేజీ డైరెక్టర్లు
క్రేజీ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ వర్మ ఒకే చోట కలిశారు. ఈ మేరకు సందీప్‌తో దిగిన ఫొటోను ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ‘VA(n)GABOND!’ అంటూ రాసుకొచ్చారు. అర్జున్ రెడ్డి, యానిమల్‌తో సందీప్ సత్తా చాటగా, ‘హనుమాన్’తో ప్రశాంత్ బ్లాక్ బస్టర్ దర్శకుల జాబితాలో చేరారు. వీరిద్దరి తదుపరి ప్రాజెక్టులు స్పిరిట్, జై హనుమాన్ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Similar News
News December 6, 2024
గ్రూప్-1,2,3 ఫలితాలు ఎప్పుడంటే?
TG: రాష్ట్రంలో గ్రూప్-1, 3 పరీక్షలు జరగ్గా, ఈ నెలలో గ్రూప్-2 నిర్వహించనున్నారు. తొలుత గ్రూప్-1 ఫలితాలు, పోస్టుల భర్తీ.. ఆ తర్వాత గ్రూప్-2 ఫలితాలు, భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. చివర్లో గ్రూప్-3 ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఇలా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని గ్రూప్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. మెరిట్ ఉన్న నిరుద్యోగులు అవకాశాలు కోల్పోకూడదని TGPSC ఇలా కొత్త విధానం అమలు చేయనున్నట్లు సమాచారం.
News December 6, 2024
FLASH: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
అడిలైడ్ వేదికగా AUSతో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పడిక్కల్, సుందర్, జురెల్ స్థానాల్లో గిల్, రోహిత్, అశ్విన్ ఎంట్రీ ఇచ్చారు.
IND: జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, పంత్, రోహిత్, నితీశ్ రెడ్డి, అశ్విన్, హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్
AUS: ఖవాజా, నాథన్, లబుషేన్, స్టీవెన్ స్మిత్, హెడ్, మార్ష్, అలెక్స్, కమిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్, బోలాండ్
News December 6, 2024
రాత్రి జీన్స్ ప్యాంట్ వేసుకునే నిద్రిస్తున్నారా?
కొందరు రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించే నిద్రపోతారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట వీటిని ధరిస్తే కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రాభంగం కలుగుతుంది. జీన్స్ బిగుతుగా ఉండటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలర్జీ, దద్దుర్లు, నడుం నొప్పి, ఉబ్బరం, లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. రాత్రి వీటిని ధరించకపోవడం బెటర్.