News March 6, 2025
PHOTO: కస్టడీలో రన్యా రావు

దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కస్టడీ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఓవైపు తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ దాఖలు చేయగా, మరోవైపు 2వ సారి కస్టడీకి కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) మరో పిటిషన్ వేసింది. నటి ఏడాదిలో 27సార్లు దుబాయ్ వెళ్లిందని, పూర్తి వివరాలు రాబట్టడానికి మరోసారి కస్టడీ అవసరం అని పేర్కొంది. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది.
Similar News
News March 23, 2025
IPL-2025: చెన్నై, ముంబై జట్లు ఇవే

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో CSK టాస్ గెలిచి బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లను పరిశీలిస్తే..
CSK: రుతురాజ్ గైక్వాడ్(C), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, దూబే, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్ అహ్మద్, ఎల్లిస్, ఖలీల్ అహ్మద్
MI: రోహిత్, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ (C), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, సత్యనారాయణ రాజు
News March 23, 2025
టాస్ గెలిచిన CSK

IPL-2025: చెన్నై వేదికగా ఇవాళ MI, CSK జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
News March 23, 2025
రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

TG: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ APR నుంచి 6KGల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్‌నగర్‌లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు.