News August 1, 2024
PHOTOS: రోహిత్, కోహ్లీతో హెడ్ కోచ్ గంభీర్
శ్రీలంకతో ఆగస్టు 2 నుంచి జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో హెడ్ కోచ్ గంభీర్ తాజాగా ముచ్చటించిన ఫొటోలను BCCI పోస్ట్ చేసింది. నిన్నటితో టీ20 సిరీస్ ముగియడంతో కోచ్ గంభీర్ ODIలపై ఫోకస్ పెట్టారు. చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్‌తో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రాక్టీస్ సెషన్‌లో గంభీర్, కోహ్లీ సరదాగా నవ్వుతూ కనిపించారు.
Similar News
News December 10, 2024
మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
News December 10, 2024
మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.
News December 10, 2024
అతిగా నిద్రపోతున్నారా?
పెద్దవారికి రోజుకు 7-8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నిద్ర గుండెకు చేటు చేస్తుందని, వెన్నునొప్పి వస్తుందని అంటున్నారు. దీంతో పాటు టైప్-2 మధుమేహానికి కారణమవుతుందట. ఎక్కువ సమయం నిద్రలో ఉంటే ‘సెరెటోనిన్’ స్థాయులు తగ్గి మైగ్రేన్ వంటి సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు. 9గంటలకు పైగా నిద్రపోయి లేస్తే బద్ధకం ఆవరించి ఆ రోజంతా అలసటగా ఉంటుందట. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో కామెంట్ చేయండి.